NTV Telugu Site icon

Telangana DSC 2024: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

Tg Dsc 2024

Tg Dsc 2024

Telangana DSC 2024: తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫైనల్‌ కీ వచ్చేసింది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అనంతరం.. అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా తుది కీని విడుదల చేశారు. తుది కీని అభ్యర్థులు విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ డీఎస్సీ తుది కీని స్కూల్‌ అసిస్టెంట్‌,లాంగ్వేజ్‌ పండిట్‌,సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌,ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.

Read Also: CM Revanth Reddy: తక్షణ సాయం అందించాలి.. కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి

ఈ ఫైనల్ కీ ద్వారా డీఎస్సీ అభ్యర్థులు తమ మార్కులను తెలుసుకోవచ్చు. త్వరలోనే ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ ఉంది. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ కీని పొందవచ్చు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ పరీక్షలు నిర్వహించబడ్డాయి.

Show comments