NTV Telugu Site icon

IAS’s Transfer : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Ias Transfer

Ias Transfer

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా.. వికారాబాద్ కలెక్టర్‌గా నారాయణ రెడ్డి. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించింది. హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతును నిజామాబాద్‌కు బదిలీ చేసింది. అమయ్‌కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా నియమించడంతో పాటు హైదరాబాద్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.

Also Read : Food Blogger Fined: వైట్ షార్క్‌ను వండి తిన్న పుడ్ బ్లాగర్..శిక్ష విధించిన అధికారులు

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండకు, కుమ్రంభీం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పంపింది. వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు, మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్‌గా, ఎస్‌ హరీశ్‌రాను రంగారెడ్డి, రాజశ్రీ షాను మెదక్‌ కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ తేజ ఎస్‌ పవార్‌ వనపర్తి కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్‌రెడ్డి నిర్మల్‌ కలెక్టర్‌గా, కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : GVL Narasimha Rao: సీఎం ముందే ఎలా ప్రకటిస్తారు.. సుప్రీంకోర్టును వెక్కిరించినట్లే..

Show comments