NTV Telugu Site icon

Kanti Velugu : ‘కంటి వెలుగు’తో ప్రపంచ రికార్డు సాధించాలి: సీఎస్ శాంతికుమారి

New Project (14)

New Project (14)

Kanti Velugu : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించారు. సోమవారం నుంచి పదిరోజుల పాటు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.

Read Also: Dog Dispute: తమిళనాడులో అంతే.. కుక్కని కుక్క అనకూడదా..?

కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటివరకు క్షేత్ర స్థాయి క్యాంప్ ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న బఫర్ టీమ్స్ ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలీయన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్ లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.

Read Also:Love marriage: ప్రేమ వివాహంలో కలతలు.. ముగ్గురు పిల్లలను కన్నతల్లి ఏంచేసిందంటే..

అలాగే ఏ.వీ. కళాశాలలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమ శిబిరాన్ని సీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు వంద రోజుల పాటు కొనసాగే కంటివెలుగు కార్యక్రమంలో ప్రపంచరికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎస్‌ పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి 15,000 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందితో కూడిన 1,500 బృందాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తాయని సీఎస్‌ శాంతి కుమారి పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సీఎస్‌ శాంతి కుమారి వెల్లడించారు.