Telangana CM: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. అయితే, రేపు ( మార్చ్ 5) సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే మీటింగ్ కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆ తర్వాత ఈనెల 6న మహబూబ్ నగర్ పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంను ఆయన ప్రారంభించనున్నారు. ఇక, 7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. అలాగే, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Read Also: OTT Movies: ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడంటే?
ఇక, మార్చ్ 7వ తేదీన వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈనెల 8న ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, మార్చ్ 9వ తేదీన ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఈనెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక, ఈనెల 12న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.