NTV Telugu Site icon

Kumari Aunty: కుమారి ఆంటీకి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే స్టాల్‌ను సందర్శిస్తా..!

Kumari Aunty New

Kumari Aunty New

CM Revanth Reddy Gave the good news to Kumari Aunty: హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తున్న ‘కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్‌ను తాను సందర్శిస్తానని సీఏం రేవంత్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

‘మీది మొత్తం రూ.1000 అయ్యింది.. రెండు లివర్‌లు ఎక్స్‌ట్రా’ అనే వీడియోతో కుమారి ఆంటీ ఫేమస్ అయింది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో కుమారి పేరు ఇటీవలి రోజుల్లో మార్మోగిపోయింది. కుమారి ఆంటీ వద్ద ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందనే టాక్‌తో ఫుడ్ లవర్స్ కేబుల్‌ బ్రిడ్జి దగ్గరి ఆమె స్టాల్‌కు ఫోటెత్తారు. హైదరాబాద్ మాత్రమే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు. సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపారు. దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయి.. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదురొన్నారు.

Also Read: Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!

భారీ టాఫిక్ జామ్ కారణంగా కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తాజాగా ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని కుమారి ఆంటీని హెచ్చరించారు. ఆమె ఫుడ్ స్టాల్‌ను క్లోజ్ చేశారు. దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం కాస్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. వేంటనే స్పందించారు. కుమారి అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని తెలంగాణ డీజీపీ, ఎంఏ యూడీ అధికారులను ఆదేశించారు. అంతేకాదు త్వరలోనే తాను కుమారి ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని సీఏం స్పష్టం చేశారు.