Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెటర్, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం విమానంలో తన ముందు ఉన్న ద్రవ పదార్థాన్ని మంచి నీళ్లు అనుకుని తాగడంతో.. నోటి, గొంతులో మంటతో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన అగర్తలలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మయాంక్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మయాంక్ నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.
మయాంక్ అగర్వాల్ జనవరి 26-29 మధ్య అగర్తలలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో మయాంక్ 51, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత మయాంక్ ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. సీటు ముందున్న పౌచ్‌లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని మంచి నీళ్లుగా భావించి తాగాడు. కొద్దిసేపటికే అతడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు. మెడికల్ ఎమర్జెన్సీతో విమానం వెనక్కి రాగా.. హుటాహుటిన అతడిని అగర్తలలో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Budget Sessions 2024: పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది: ద్రౌపది ముర్ము
రంజీ ట్రోఫీలో భాగంగా మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని కర్ణాటక జట్టు ఫిబ్రవరి 2వ తేదీన తన తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. సూరత్‌లో రైల్వేస్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. మయాంక్ ఈ మ్యాచ్‌లో ఆడగలడా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మయాంక్ గత కొంతకాలంగా భారత జట్టులో ఆడలేదు. 5 ఫిబ్రవరి 2020న హామిల్టన్ వన్డేలో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. 4 సెంచరీల సహాయంతో టెస్టులో 1488 పరుగులు చేయగా.. వన్డేల్లో 86 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!