CM Revanth Reddy: ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ వైడ్‌గా తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే పుష్ప కంటే ముందే టాలీవుడ్‌లో బన్నీ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ‘ఆర్య’తో లవర్ బాయ్‌గా అలరించి, అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రాల్లో పరుగు ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ అప్పట్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట హాట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ పోస్టర్ కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ ప్రకారం.. పరుగు సినిమాలో అల్లు అర్జున్, హీరోయిన్ షీలా ఒక బస్ స్టాండ్ లో కూర్చొని ఉన్నప్పుడు కొందరు షీలాపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తుంటారు. సరిగ్గా అదే సీన్‌లో హీరోయిన్ వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పొలిటికల్ పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్‌ను నిశితంగా గమనిస్తే.. అందులో ఉన్నది మరెవరో కాదు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో వేసిన ఒక ఒరిజినల్ వాల్ పోస్టర్ ఆ బస్ స్టాండ్ సీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అలా అనుకోకుండా రికార్డ్ అయిపోయింది. అప్పట్లో రేవంత్ టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆ పోస్టర్ పసుపు రంగులో కనిపిస్తోంది. 2008లో విడుదలైన పరుగు సినిమా షూటింగ్ సమయంలో రేవంత్ రెడ్డి ఇంకా స్టార్ లీడర్ కాలేదు. కానీ, కాలక్రమంలో ఆయన తెలంగాణ సీఎం స్థాయికి ఎదిగారు. మొత్తానికి అటు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు ఈ పాత వీడియో క్లిప్‌ను తెగ ట్రెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

