NTV Telugu Site icon

Pralhad Joshi: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Pralhad Joshi

Pralhad Joshi

Pralhad Joshi: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పోస్టులో 2014-15 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే, సీఎంఆర్ (CMR) డెలివరి గడువును పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Read Also: AUS vs IND: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ఇక రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీ విషయమై మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుండి తెలంగాణకు సుమారు రూ.2,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. గతంలో సంబంధిత పత్రాలను సమర్పించలేదని.. ఇప్పుడు తాము అవసరమైన పత్రాలను సమర్పించామని, అలాగే వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే, సౌర విద్యుత్ పై సబ్సిడీ కోరినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘ప్రధాని కుసుమ్’ పథకం కింద మహిళ సంఘాలకు 4,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, దీనికి సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సబ్సిడీతో సహా, సోలార్ పంపులను అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వీటి పై సానుకూలంగా స్పందించి, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.