Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రకటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మంది కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేయూత పెన్షన్ మొత్తాన్ని నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా అండ అవసరమైన వారికి భద్రత కల్పించడం, మహిళలకు ఆత్మగౌరవం అందించడం తమ ప్రభుత్వ సంక్షేమ విధానంలో కీలక భాగమని అన్నారు. కొత్తగా మంజూరయ్యే 4,63,857 చేయూత పెన్షన్ల ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు నవంబర్ 26 నుంచే ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నామని, ఇది ప్రభుత్వం కల్పిస్తున్న సామాజిక భద్రతకు నిదర్శనమని చెప్పారు.
Also Read
- AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
- Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
- AP High Court: చంద్రబాబుపై కేసుల మూసివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Astrology: నవంబర్ 19 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
ఇక తెలంగాణ ఆడబిడ్డలకు చీర అంటే కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదని, అది పుట్టింటి ఆత్మీయతకు, గౌరవానికి ప్రతీక అని మంత్రి సీతక్క అభివర్ణించారు. ఆడబిడ్డను గౌరవించే తెలంగాణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని తెలిపారు. కేవలం చీరల పంపిణీకే పరిమితం కాకుండా, ‘మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సదుపాయాలు కల్పిస్తూ వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. నవంబర్ 26న ఒకే వేదికగా చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం కావడం ద్వారా ప్రభుత్వం తన పాలనా దృక్పథాన్ని చాటుతోందని, భవిష్యత్తులోనూ మహిళల ఆర్థిక ఎదుగుదలకు మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
-
Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్‌తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
-
Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..