Telangana Cabinet: 15కు చేరిన తెలంగాణ మంత్రి వర్గం.. మరో మూడు ఖాళీలు

  • 15కు చేరిన తెలంగాణ మంత్రి వర్గం
  • మరో మూడు ఖాళీలు
  • త్వరలోనే మరోసారి మంత్రి వర్గ విస్తరణ
Cm Revanth

Cm Revanth

నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తెలంగాణ మంత్రి వర్గం 15కు చేరింది. మంత్రి వర్గంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. సామాజిక వర్గాల కూర్పుతో తెలంగాణ మంత్రి వర్గం రెడ్డి 4, ఎస్సీలు 4, బీసీలు 3, వెలమ 1, బ్రాహ్మణ 1, కమ్మ 1, ఎస్టీ 1 నుంచి మంత్రులుగా ఉన్నారు.

Also Read:Telangana Cabinet Expansion: రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణస్వీకారం..

ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి. నిజామాబాద్‌ జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం. మైనార్టీలకు మంత్రి వర్గంలో ఛాన్స్‌ దక్కలేదు. త్వరలోనే మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. పదిమందికిపైగా ఆశావాహులు మంత్రి పదవి దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మాల్‌ రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుజ్జగింపులకు రంగంలోకి దిగారు మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.