Site icon NTV Telugu

Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. గిగ్ వర్కర్ల బిల్లుతో సహా 10 బిల్లుల ఆమోదం.?

Cabinet Meeting

Cabinet Meeting

Telangana Cabinet Meeting: ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా, మరోవైపు నేడు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో సుమారు 10 కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే పలు డ్రాఫ్ట్ బిల్లులపై చర్చించి, వాటికి తుది రూపం ఇవ్వనున్నారు.

Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..

ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు-2025 ప్రధానంగా కనిపిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన సామాజిక భద్రత కోడ్ నేపథ్యంలో, రాష్ట్రంలోని సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్లకు (డెలివరీ బాయ్స్, డ్రైవర్లు) గుర్తింపు కార్డులు, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలను అందించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దీనిపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

QNet పై భారీ దాడులు… మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు..!

అలాగే కోర్ అర్బన్ యాక్ట్ పై నిరన్యం తీసుకోబోతున్నారు. పాత జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కొత్తగా ‘కోర్ అర్బన్ యాక్ట్’ డ్రాఫ్ట్ బిల్లుపై చర్చ జరగనుంది. పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసం దీనిని తీసుకురానున్నారు. ఇంకా మారుతున్న ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా జీఎస్టీ చట్టంలో అవసరమైన మార్పులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20న ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై నేడు సభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. సభ్యుల సందేహాలు, విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం తన బడ్జెట్ ప్రాధాన్యతలను వివరించనుంది.

Exit mobile version