Site icon NTV Telugu

Telagana Cabinet Meeting : ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

Telangana Cabinet

Telangana Cabinet

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. అయితే.. ఈ సమావేశంలో అదనపు నిధుల సమీకరణ అంశంపై చర్చించనున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎంబీ నిబంధనల ప్రకారం రుణాలు తీసుకునేందుకు అనుమతులు ఇవ్వని నేపథ్యంలో.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనపు వనరులను ఏవిధంగా సమీకరించాలనే అంశంపై కేబినెట్‌ చర్చించనుంది.

అంతేకాకుండా ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్లు 57 ఏండ్లకు వృద్ధ్యాప్య ఫించన్లు, అనాథ పిల్లల సంరక్షణ, డయాలసిస్‌ రోగుల ఆసరా, స్వతంత్య్ర వజ్రోత్సవాల వేళ సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదల, తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణ, మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Exit mobile version