Cabinet Meeting: నేడు (జులై 25)న జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదా పడిందని సమాచారం అందుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్‌కి సంబంధించి అనేక అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, పలువురు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొంటున్నారు. ఇవాళ కూడా వీరు ఢిల్లీలోనే ఉండనున్నారు.
ఈ ముగ్గురితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తం ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో క్యాబినెట్ సమావేశానికి కోరం నెరవేరకపోవచ్చన్న అంచనాతో ముఖ్యమంత్రి వాయిదా వేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు క్యాబినెట్ వాయిదా విషయంలో అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అధికారికంగా వాయిదా నిర్ణయం తీసుకోవచ్చని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో మళ్లీ సమావేశానికి తేదీ ఖరారు చేయనున్నట్లు సమావేశం.
IND vs ENG: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్‌కు పిలుపు.. ఇషాన్ కిషన్‌ను ఏమైంది?!
