NTV Telugu Site icon

TG Cabinet : జనవరి 4న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కొత్త రేషన్‌ కార్డులు, రైతు భరోసాపై కీలక చర్చ

Tg Cabinet Meeting

Tg Cabinet Meeting

TG Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు సహాయం, కొత్త రేషన్ కార్డులు, , నూతన టూరిజం పాలసీపై చర్చించనున్నట్లు సమాచారం.

సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా కార్యక్రమంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయడంపై ప్రతిపాదనలు కేబినెట్ లో పరిశీలించబడతాయి.

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ఇక విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. యాదగిరిగుట్ట దేవాలయానికి తితిదే తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ ఆమోదముద్ర వేయవచ్చని తెలుస్తోంది. అంతేగాక, కొత్త టూరిజం పాలసీపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

2025 New Year: కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన న్యూజిలాండ్.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్

Show comments