ఇవాళ తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగనున్నది. సెక్రెటేరియట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, బనకచర్ల, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక మీదప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డీఏ, సమస్యలపైనా డిస్కన్ చేసే చాన్స్ ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అడిషినల్ డైరెక్టర్ పోస్టు, ఇతర విభాగాల్లో 16 పోస్టులు అడిషినల్ పోస్టులు, ఫ్యాప్సికి పన్ను మినహాయింపు, హ్యామ్ రోడ్స్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Also Read:Meghalaya: అదృశ్యానికి ముందు సోనమ్ ఫోన్ సంభాషణ.. ఆడియో క్లిప్ వైరల్
ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ప్రకటనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలు, ఫోన్‌ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, జీఎస్టీ, భూదాన్‌భూముల దందా, గొర్రెల స్కీం లాంటి స్కాముల సంగతి తేల్చాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఇప్పటికే పవర్ కమిషన్, కాళేశ్వరం రిపోర్టులు చేతికి అందడం, మిగిలిన ఎంక్వైరీలన్నీ తుదిదశకు చేరిన నేపథ్యంలో గురువారం జరుగబోయే కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
