NTV Telugu Site icon

Hyderabad Metro: మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Telangana Cabinet

Telangana Cabinet

Hyderabad Metro: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 1. నాగోల్ టు ఎల్బీ నగర్, 2.ఎల్బీ నగర్ టు హయత్ నగర్. 3.ఎల్బీ నగర్ టు శంషాబాద్ మార్గాల్లో ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరించనుంది. మెట్రో విస్తరణతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు నగరవాసులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

Read Also: TGSRTC Cargo : ఇంటి వ‌ద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు..!

రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుపై నిర్ణయం తీసుకుంది. ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ తీర్మానించింది. ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరా 250 రూపాయల చొప్పున భూమిని మంత్రివర్గం కేటాయించింది.