TG Cabinet: పలు కీలక నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం..

  • ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం
  • అజెండాలో 22 అంశాలపై చర్చ
  • రైతు భరోసాకి కేబినెట్‌ ఆమోదముద్ర
  • ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్‌, రేషన్‌ కార్డుల జారీ..
  • , సన్నబియ్యం పంపిణీ, మండలాల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ.
Tg Cabinet

Tg Cabinet

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలుపైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అజెండాలో 22 అంశాలు ఉన్నాయి. అందులో..

* రైతు భరోసాకి ఆమోదముద్ర
*ఇందిరమ్మ ఇళ్లు
*బీసీ రిజర్వేషన్లు
*నూతన మండలాల ఏర్పాటు
*రేషన్ కార్డుల జారీ
*సన్న బియ్యం – ఎప్పటి నుంచి ఇవ్వాలి
అనే అంశాలపై చర్చించారు. అంతేకాకుండా.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ 2 వ్యయం 1784 కోట్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డిలో భాగంగా ఎదుల–డిండికి 1800 కోట్ల అంచనా వ్యయానికి క్యాబినెట్​ ఆమోదం తెలిపింది. మరోవైపు.. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్‌లో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనంకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేడియల్ రోడ్స్‌పై చర్చించారు.