Telangana BJP Meeting: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం, నేడు (అక్టోబర్ 5) రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కీలక చర్చ జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం మరియు అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది.
Koti Deepotsavam 2025: ఆధ్యాత్మిక మహాసమ్మేళనం.. నవంబర్ 1 నుంచి భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డి.కె. అరుణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని అన్నారు.
Evergreen Club 80 : 80’S రీ యూనియన్.. తళుక్కుమన్న స్టార్స్ ను చూశారా..
అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుండి వచ్చిన నిధులను మళ్లించాయని, ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నిధులు లేక కేంద్ర నిధుల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో గ్రామీణ తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని అన్నారు. ‘సడక్ యోజన’ కింద రోడ్లు, ‘వనమహోత్సవానికి’ నర్సరీల ఏర్పాటు, గ్రామ గ్రామాన నిర్మించిన స్మశాన వాటికలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు అందించిందని ప్రజలకు తెలపాలని సూచించారు. ఇంకా గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందించిన సంక్షేమాన్ని, నిధులను ప్రజలకు అర్థమయ్యే విధంగా మన ప్రజా ప్రతినిధులు వివరించాలని రామచందర్ రావు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం బీజేపీకి అత్యంత కీలకమైనదిగా మారింది.
