ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదని… కవితని పార్టీ లోకి తీసుకోమని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ టాక్స్ అన్న వారి తలలో మెదడు లేదు పెండ(గోబర్) ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే.. ఆ రెండు పార్టీ లు అన్నదమ్ములు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి కేవలం బ్యారేజీలపైనే కాదు.. మొత్తం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ జరపాలన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కవిత గురించి ఎక్కువగా ఆలోచించొద్దని తెలిపారు. యూరియా కొరతపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ పొరపాటు వల్లనే తెలంగాణలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
READ MORE: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. హడలెత్తిపోతున్న ప్రజలు
” కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్స్ తగ్గించి అన్ని వర్గాలకు పండుగ బహుమానం కేంద్రం ఇచ్చింది. మోడీ నేతృత్వంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పన్నుల వ్యవస్థను సరళీకరణ చేశారు. నిత్యావసర వస్తువులపై టాక్స్ ను జీరో చేశారు. మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో ఊరట లభించింది. మోడీ, నిర్మల సీతారామన్ కి కృతజ్ఞతలు. జీఎస్టీ రేట్స్ తగ్గించినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. రాష్ట్ర మంతటా కార్యక్రమాలు చేయాలి.. వన్ నేషన్ వన్ లా వైపు కూడా వెళ్తున్నాం.. ఎల్లుండి అమిత్ షా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వేడుకల్లో పాల్గొంటారు… అమిత్ షా పార్టీ కార్యక్రమం ఇంకా ఫైనల్ చేయలేదు. అధికారిక కార్యక్రమంతో పాటు మోజన్జాహి మార్కెట్ లో గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు.” అని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.
