Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Betting App Case Celebrities Investigation

Betting Apps : బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సంచలనన వ్యాఖ్యలు

Published Date :March 21, 2025 , 1:01 pm
By Gogikar Sai Krishna
  • బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం
  • బెట్టింగ్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల వివరాలు సేకరిస్తున్న పోలీసులు
  • ఏడాదికాలంలో బెట్టింగ్‌ ఊబిలో చిక్కుకుని 15 మంది ఆత్మహత్య
  • తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు
Betting Apps : బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ  సంచలనన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Betting Apps : తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు బి.ఎన్.ఎస్ లోని 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3, 3(ఏ), 4 సెక్షన్ల కింద, అలాగే ఐటీ యాక్ట్ లోని 66(డి) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటివరకు పలువురు ప్రముఖులు తమ వైఖరిని ప్రకటించారు. నటుడు విజయ్ దేవరకొండ తన ప్రచారం ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే పరిమితమని పేర్కొనగా, రానా దగ్గుబాటి కూడా తాను నైపుణ్య ఆధారిత గేమ్‌లను మాత్రమే ప్రమోట్ చేశానని స్పష్టం చేశాడు. మరోవైపు ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా వీడియోను పోస్ట్ చేసి, 2016 లో మాత్రమే ఈ యాప్‌లకు ప్రచారం చేశాను. కానీ, ఆ తర్వాత అవి తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని గుర్తించి 2017 నుంచి పూర్తిగా ప్రమోట్ చేయడం మానేశాను అని వివరించాడు.

సెలబ్రిటీల ప్రచారం వల్ల బెట్టింగ్ యాప్‌ల ప్రభావం పెరిగిందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ యాప్‌ల వలన భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని తేలింది. దర్యాప్తులో వెల్లడైన మరొక షాకింగ్ నిజం ఏమిటంటే, గత ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు ఇప్పటివరకు 15 కేసులను నమోదు చేసి, బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యులను ప్రశ్నించి, అసలు ఈ యాప్‌లు ఎలా పనిచేస్తున్నాయి, వీటి ముళ్ల చుట్టూ మోసపోయిన వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కేసు నమోదైన 25 మంది స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయడానికి మియాపూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే సంబంధిత సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేయనున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడంపై, ప్రజల ఆర్థిక నష్టంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అందులో భాగమైనవారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది. ఈ కేసు మరింతగా ఉత్కంఠ రేపుతుండగా, సినీ తారల ప్రమోషన్ల కారణంగా ప్రజలకు ఎంతమేరకు నష్టం జరిగిందో స్పష్టత రావాల్సి ఉంది. మరి, ఈ దర్యాప్తు ఎంతవరకు ముందుకు సాగుతుందో, ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై సరైన క్లారిటీ లేదన్నారు. 2017 గెమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణాలో ఆన్లైన్ గెమింగ్ బ్యాన్ అయిందని, మొత్తం 108 ఇల్లీగల్ యూఆర్‌ఎల్‌ లను బ్లాక్ చేసామన్నారు. చైనీస్ యూఆర్‌ఎల్‌లను ఫాలో కాకుండా అనేక ఇల్లీగల్ URL లను పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు తమ మొబైల్స్ ద్వారా వచ్చే పాప్ అప్స్ పైన సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తే వాటిని బ్లాక్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. వేరు వేరు ప్రాంతలనుంచి ఫేక్ GPS ద్వారా jio ఫెన్సింగ్ యాక్సెస్ జరుగుతుందని, స్కిల్ గేమింగ్ అని చెప్పే మాటలు అబద్దమన్నారు ఎస్పీ ప్రసాద్‌. ఆన్లైన్ గెమింగ్ ద్వారా నష్టపోయిన ఒక్క గేమింగ్ కంపెనీ లేదని, గేమింగ్ కంపెనీ ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ వారు పన్నిన పన్నాగం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. స్కిల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. స్కిల్ గేమ్ నాన్ స్కిల్ గేమ్స్ తో సంబంధం లేదు.. ప్రతి ఆన్లైన్ గేమ్ వలన నష్టాలు ఉన్నాయని, స్కిల్ గేమ్స్, నాన్ స్కిల్ గేమ్స్ పైన లీగల్ అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. భారత చట్టాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Samantha : ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Betting
  • Celebrities
  • miyapur police
  • online gaming
  • Prakash Raj

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions