Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పచ్చిగుడ్లతో (Raw Eggs) తయారుచేసే మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ మరియు విక్రయాలపై ఏడాది పాటు పూర్తి స్థాయి నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ (Commissioner of Food Safety) ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 (Food Safety and Standards Act, 2006) లోని సెక్షన్ 30(2)(ఎ) ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
అయితే,ఈ నిషేధాజ్ఞలు 2026 అక్టోబర్ 30వ తేదీ నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. నాటి నుంచి ఏడాది పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ (నంబర్ 984) ను 2026 నవంబర్ 4వ తేదీన జారీ చేశారు. పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్ వినియోగం వల్ల ఆహార కాలుష్యం (Food poisoning), తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజల క్షేమార్థం ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది… పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్ వినియోగం వల్ల ఆహార కాలుష్యంతో పాటు.. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తిన ఘటనలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏడాది పాటు నిషేధం విధించింది..

