Governor Jishnu Dev Varma : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల హోరాహోరీతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయన ప్రసంగం మధ్యలోనే బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు.
గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ, సామాజిక న్యాయం, సంక్షేమం పట్ల ప్రభుత్వ కట్టుబాటును హైలైట్ చేశారు. రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్‌గా మారిందని గవర్నర్ తెలిపారు. వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ప్రకటించారు. యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు “యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. గవర్నర్ ప్రసంగించేటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) హాజరు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
Pranay Amrutha: ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది.. అమృత ఎమోషనల్ పోస్ట్
