Site icon NTV Telugu

Assembly Sessions: ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు

Assembly

Assembly

Assembly Sessions: రాష్ట్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. కాగా, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద పీట వేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.37,000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఆ కేటాయించిన నిధుల్లో రూ.16 వేల కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ కొలిక్కివచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా, నిధులు కేటాయించడంతోపాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులనూ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Drone Hulchul in Tirumala Live: తిరుమలలో డ్రోన్ కలకలం .. ఎన్టీవీ చేతిలో వీడియో

మరోవైపు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ కసరత్తను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. బడ్జెట్‌లో వివిధ పథకాలకు కేటాయింపులతో పాటు కేంద్రం నుంచి.. రాష్ట్రానికి రానున్న నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఆర్ధిక శాఖ ప్రతిపాదనలు సమర్పించింది.

Exit mobile version