NTV Telugu Site icon

Love Marriage: ఆర్మూరు ‘ఆకాష్’.. అమెరికా ‘ఓల్సా’.. ఒక్కటైన ప్రేమజంట

New Project (29)

New Project (29)

Love Marriage: ప్రేమకు కులం, మతం, ధనిక, పేద, రంగు, ప్రాంతంతో సంబంధంలేదు. ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతామో తెలియదు. సినిమాల్లో చూపించిన మాదిరిగా ఓ వ్యక్తిని చూడగానే తన మనసుకు దగ్గరగా అనిపించిన వ్యక్తిపై ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది. విధినిర్వహణలో ఆ ఇద్దరూ పరిచయం అయ్యారు. ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకున్నారు. పెద్దలకు ఎలా చెప్పాలా? అని మదనపడ్డారు. చివరికి ఎలాగోలా ఒప్పించగలిగారు ఖండాలు, సప్త సముద్రాలు దాటిన ఆ ప్రేమకథ.. చివరకు పెళ్లితో సుఖాంతం అయ్యింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈ వివాహం.. స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకు కారణం.. అబ్బాయి లోకల్‌ అయితే.. అమ్మాయి అమెరికా దేశస్థురాలు.

Read Also: Cyber Cheating: బాసర పేరుతో భారీ దందాకు తెరతీసిన సైబర్ కేటుగాళ్లు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందుపేట్ గ్రామానికి చెందిన మూగ ఆకాష్.. చర్చి ఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్నాడు. ఐదేళ్ల కిందట.. అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాతో అతనికి పరిచయం ఏర్పడింది. నర్సింగ్ పూర్తి చేసిన ఓల్సా.. భారత్‌లో క్రైస్తవ మిషనరీల్లో నర్సుగా సేవలందిస్తోంది. అయితే ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల తర్వాత.. ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించలిగారు. మంగళవారం ఆర్మూర్‌లోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరిద్దరిని ఆశీర్వదించడానికి స్థానికంగా ఉన్న బంధువులతో పాటు.. అమ్మాయి తరుపు విదేశీ బంధువులు కూడా తరలివచ్చారు. ఇష్టపడ్డ తాము పెళ్లితో ఒక్కటి కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని చెబుతోంది ఆ జంట. అందుకే ఈ వివాహం స్థానికులను అంతలా ఆకట్టుకుంది.

Read Also:Kishan Reddy : కూర్చుని చర్చిద్దాం రండి.. ఎవరేం చేశారో..