NTV Telugu Site icon

Nalgonda : నల్లగొండ జిల్లాలో విషాదం.. నీటిలో పడి ఇద్దరు కూలీల మృతి

Children Drowned

Children Drowned

Nalgonda : నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధోనిపాముల గ్రామం సమీపంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)లో ఇద్దరు మహిళా కూలీలు నీటిపారుదల ట్యాంకు(ఇరిగేషన్ ట్యాంకు)లో మునిగి చనిపోయారు. మృతులు చిలుక రామలింగమ్మ(60), సూర లకశమ్మ(62)గా గుర్తించారు.

Read Also: Sanjay Dutt: షూటింగ్​లో బాంబు పేలుడు.. గాయాలపాలైన సంజయ్ దత్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం సమయంలో మహిళలు తమ పని స్థలం నుండి తిరిగి వస్తుండగా చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి నీటిపారుదల ట్యాంక్‌లోకి దిగారు. అయితే లోతు తెలియక ఇద్దరూ నీటిలోకి జారిపోయారు. వారిని కాపాడేందుకు ఇతర మహిళా కార్మికులు ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేకపోయారు. వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూలీలు కళ్లముందే చనిపోవడంతో తోటి వారు ఆవేదనకు గురయ్యారు. రెండు కుటుంబాలు ఆడదిక్కును కోల్పోవడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

Read Also:India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్‌పైనే..