Site icon NTV Telugu

Tejas Thackeray: మాజీ సీఎం కుమారుడికి సీరియస్..

Tejas Thackeray

Tejas Thackeray

Tejas Thackeray: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయనను వారి కుటుంబ సభ్యులు రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తేజస్ కోలుకుంటున్నట్లు సమాచారం. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే – రష్మి ఠాక్రేలు ఆసుపత్రిలో తేజస్ తో పాటు ఉన్నారు. గత మూడు రోజులుగా తేజస్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం తెలియలేదు. ఆయన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ఉదయం ఆసుపత్రికి వెళ్లి తేజస్ ఆరోగ్యం గురించి ఆరా తీశారని పలు నివేదికలు వెల్లడించాయి.

READ ALSO: Maha Shivratri 2026: మహాశివరాత్రి ఉపవాసం విరమించడానికి శుభ సమయాలు ఇవే.. ఈ తప్పులు చేయకండి!

తేజస్ ఠాక్రే ఎవరంటే..
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే. గతంలో ఆయన శివసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఎన్నికల ప్రచారం చేస్తూ కనిపించారు. నిజానికా ఆయన అధికారికంగా క్రియాశీల రాజకీయాల్లోకి ఇంకా ప్రవేశించలేదు. ఆయన ఒక వన్యప్రాణి పరిశోధకుడు, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన వన్యప్రాణుల సంరక్షణకు ఎంతగానో కృషి చేశారు. తమిళనాడులోని ఒక భారతీయ పరిశోధనా బృందం ఒక కొత్త జాతి బల్లిని కనుగొంది. ఈ బల్లి జాతికి తేజస్ ఠాక్రే పేరు పెట్టారు. ‘TT’ అని కూడా పిలువబడే తేజస్ ఠాక్రే , ఉభయచరాలు, సరీసృపాల కోసం వెతుకుతూ 2012లో అంబోలికి తన మొదటిసారి వెళ్ళాడు. ఈ పర్యటనలో ఆయన ఒక కొత్త జాతి ఈగను కనుగొన్నాడు. ఈ జాతికి తరువాత స్కిస్తురా హిరణ్యకేషి అని పేరు పెట్టారు. తేజస్ థాకరే ఒకసారి మీడియాతో మాట్లాడుతూ ..”నేను చాలాసార్లు దసరా ర్యాలీలలో పాల్గొన్నాను. నేను మహారాష్ట్ర అంతటా పర్యటించాను, కానీ ప్రజలు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ నాకు జనసమూహాలు, ర్యాలీల కంటే అడవి అంటే ఎక్కువ ఇష్టం” అని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్య వర్గాలు తెలిపాయి.

READ ALSO: Kollywood : కోలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షగా వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్

Exit mobile version