Site icon NTV Telugu

Tejas Crash Dubai: దుబాయ్ ఎయిర్‌షోలో కూలిన తేజస్ యుద్ధ విమానం.. భారత్ పైలట్ మృతి

Tejas Crash Dubai

Tejas Crash Dubai

Tejas Crash Dubai: దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది.

READ ALSO: Sania Mirza: టెన్నిస్‌ రాకెట్‌ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది!

ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారుచేసింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 4.5వ తరం ఫైటర్‌జెట్‌. ప్రస్తుతం భారత వాయుసేనలో ఎంకే1 తేజస్‌ జెట్‌లు సేవలు అందిస్తున్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తేజస్‌ ఫైటర్‌ జెట్‌ శిక్షణ సార్టీలో ఉండగా.. కూలిపోయింది. ఆ ఘటనలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదంపై స్పందించిన భారత వాయుసేన..
‘‘దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టసమయంలో పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం’’ అని వాయుసేన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

దుబాయ్‌ ఎయిర్‌షో ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఈ ఎయిర్‌షోలో పాల్గొని సందడి చేస్తాయి. ఇందులో భాగంగా పాల్గొన్న తేజస్ యుద్ధ విమానం పైలట్ నెగెటివ్‌ జీ-ఫోర్స్‌ టర్న్‌ నుంచి యుద్ధవిమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

READ ALSO: Gujarat BLO Suicide: ‘నేను ఇకపై ఈ పని చేయలేను’.. ఆత్మహత్య చేసుకున్న మరో BLO

Exit mobile version