Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, యువ కథానాయకుడిగా వైవిధ్యమైన కథలతో సంచలన హిట్‌లను అందుకుంటున్న హీరో తేజ సజ్జా. తాజాగా ఈ హీరో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. తనపై వచ్చిన ట్రోల్స్, కెరీర్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ఒకేసారి ఇండస్ట్రీలో పెద్ద హీరో అయిపోవాలని రాకూడదని అన్నారు. మనతో ఒక చిత్రం స్టార్ట్ చేస్తే మినిమం గ్యారెంటీ ఉంటుంది, అనేలా మనల్ని మనం నిరూపించుకోవాలని చెప్పారు. అవకాశాలు వచ్చే వరకూ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండాలని అన్నారు. నిజానికి పెద్ద పెద్ద హీరోలను కూడా కొందరు ట్రోల్స్ చేస్తుంటారని, నేషనల్ అవార్డులు వచ్చిన సినిమాలపై కూడా విమర్శలు చేసిన వాళ్లు ఉన్నారని చెప్పారు. అలాంటి విమర్శకుల విమర్శలను ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని అన్నారు.
ప్రతిభను నమ్ముకొని కెరీర్‌లో ముందుకెళ్లాలని సూచించారు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు అందరికీ మన విలువ తెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా వాస్తవాలు బయటికొస్తాయని అన్నారు. విమర్శించే వారిని దృష్టిలో పెట్టుకుంటే పని చేయవద్దని, ఆడియన్స్‌ను అలరించాలనే ఆలోచనలతో సినిమాలను తెరకెక్కించాలని అన్నారు. రవితేజ 10 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారని, అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆయన ఒక స్టార్‌గా ఎదిగారని చెప్పారు.
READ ALSO: Shambala Day 1 Collection: రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయి కుమార్ ‘శంబాల’..
