Teja Sajja : నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఏకలవ్య శిష్యుడిని..

Whatsapp Image 2024 01 07 At 11.44.33 Pm

Whatsapp Image 2024 01 07 At 11.44.33 Pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. తెలుగు లో మొదటి సూపర్ హీరో కథగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా పోస్టర్స్,సాంగ్స్ మరియు ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్‌’. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.వినయ్‌ రాయ్‌ విలన్ గా నటించారు.వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్రను పోషించారు. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్‌, స్పానిష్‌, కొరియన్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కించారు. అనుదీప్‌ దేవ్‌, హరిగౌడ మరియు కృష్ణ సౌరభ్‌ సంగీతం అందించారు.

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టింది.దానిలో భాగంగా హనుమాన్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జనవరి 7) హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగింది. ఈ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ ఈవెంట్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.. మా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గారు రావడం సంతోషంగా వుంది. చిన్నప్పటి నుండి నేను ఆయనకు వీరాభిమానిని.. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. మా అమ్మ నాన్నల తరువాత నేను థాంక్స్ చెప్పుకునే వ్యక్తి చిరంజీవి గారు. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని అని తేజ సజ్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.. అలాగే హనుమాన్ మూవీ కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడినట్లు తెలిపాడు.. ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చేందుకు నిరంతరం శ్రమ పడినట్లు తేజ సజ్జా తెలియజేసారు.