ChatGPT Suicide Case: జిందగీలా ఎప్పుడు ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. పాపం ఓ 16 ఏళ్ల పిల్లవాడు చావడానికి చాట్‌జీపీటీని సాయం అడిగిండు. దానికి నిజంగా మనసు లేదు. ఆ పిల్లగాడు అడుగుడుతోనే ఎలా చచ్చిపోలో వివరంగా విశ్లేషించింది. ఇంకేముంది ఆ పిల్లగాడు అది ఎట్లా అయితే చెప్పిందో అట్లాగే చేసి ప్రాణం విడిచిండు. ఇందతా చూస్తుంటే ప్రపంచం ఎక్కడికి పోతుందని అనిపిస్తలేదా?. విషయం పిల్లగాడి అమ్మానాన్నలకు తెలియడంతో వాళ్లు వెంటనే తమ బిడ్డ లేక్క మరోకరు చనిపోడానికి ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యి ఏకంగా ఓపెన్ఏఐపై, ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్‌పై కోర్టులో దావా వేశారు.
READ ALSO: Rajnath Singh: సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలి.. యుద్ధాలపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
16 ఏళ్ల బాలుడు ఆడమ్ రైన్..
కాలిఫోర్నియాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఆడమ్ రైన్ చాట్‌బాట్ సాయంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దీంతో బాలుడి కుటుంబం ChatGPT పై దావా వేసింది. చాట్‌బాట్ అతనికి మానవ సహాయం కోరమనడానికి బదులుగా, ఆడమ్ రైన్ ఆలోచనలకు మద్దతు ఇచ్చిందని కుటుంబసభ్యులు దావాలో పేర్కొన్నారు. 2024 బాలుడు ChatGPTని ఉపయోగించడం ప్రారంభించాడని, ఇతర విద్యార్థుల మాదిరిగానే ప్రధానంగా హోంవర్క్ కోసం దీనిని ఉపయోగించాడని కుటుంబం సభ్యులు తెలిపారు. అలాగే దీనిని సంగీతం, బ్రెజిలియన్ జియు-జిట్సు, జపనీస్ ఫాంటసీ కామిక్స్ వంటి తన అభిరుచులను అన్వేషించడానికి, కెరీర్ మార్గాల గురించి అడగడానికి ఉపయోగించాడు. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత బాలుడు AI తో చేసే సంభాషణలు పూర్తిగా మారిపోయాయి. ఆడమ్ ఏఐతో పాఠశాల, అభిరుచుల గురించి మాట్లాడటానికి బదులుగా తన భావోద్వేగాలను వ్యక్తపరచడం ప్రారంభించాడని తెలిపారు.
అందులో తమ కుమారుడు నెలలతరబడి చాట్ జీపీటీతో ఆత్మహత్య గురించి చర్చించిన తర్వాత అది ఇచ్చిన సలహా ప్రకారం ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్య ఎలా చేసుకోవాలని రైన్ చాట్‌బాట్‌ను పలుమార్లు ప్రశ్నించగా అందుకు ఉన్న అవకాశాలు, పద్ధతుల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చిందని బాధితులు దావాలో పేర్కొన్నారు. బాలుడు సూసైడ్ నోట్‌ను రాయడానికి కూడా సహకరించినట్లు తెలిపారు. ఇకనైనా చాట్ జీపీటీలో స్వీయ-హాని పద్ధతుల కోసం వెతికిన సమయంలో అటువంటి సమాచారాన్ని అందివ్వకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఓపెన్ ఏఐ ప్రతినిధి స్పందిస్తూ.. రైన్ మరణం తమను ఎంతో బాధించిందని అన్నారు. ఇటువంటి సలహాలు అడిగినప్పుడు చాటీపీటీ వినియోగదారులకు పలు హెల్ప్ లైన్ నెంబర్లను సైతం సూచిస్తుందని తెలిపారు. ఓపెన్ ఏఐ రక్షణ చర్యలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
బాధిత కుటుంబం తరుఫున న్యాయవాది మీతాలి జైన్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రతిరోజూ గంటల తరబడి AI చాట్‌బాట్‌లతో మాట్లాడుతూ ఉంటారని, కొన్నిసార్లు రాత్రంతా మేల్కొని ఉంటారని అన్నారు. ఈ చర్యలు “ప్రమాదకరమైన ఫీడ్‌బ్యాక్ లూప్‌లను” సృష్టించగలవని, ఇక్కడ AI కొన్ని ఆలోచనలు లేదా ప్రవర్తనలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఈ చర్యలు కాలక్రమేణా వ్యక్తిని మరింత దిగజార్చుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడమ్ తన చాట్‌లలో “ఆత్మహత్య” అనే పదాన్ని దాదాపు 200 సార్లు ప్రస్తావించగా, చాట్‌జీపీటీ ప్రత్యుత్తరాలలో 1,200 కంటే ఎక్కువ సార్లు దానిని ఉపయోగించిందని తెలిపారు.
READ ALSO: Pixel Dhruva Space Mission: సుంకాల పెంపు వేళ.. అమెరికా గడ్డపై భారత్ జెండా..
