Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఒకరి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత ఓ వ్యక్తి 19 ఏళ్ల కారు క్లీనర్ ప్రైవేట్ పార్ట్‌లోకి ప్రెజర్ ఎయిర్ పైపును జొప్పించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మోహిత్ పైపు ప్రైవేట్ భాగంలోకి జొప్పించిన అనంతరం వాల్వ్ ఓపెన్ చేశాడని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని సిహాని గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాకేష్ మార్గ్‌లోని పెట్రోల్ పంప్‌లో కారు క్లీనర్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడిని విజయ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో అతడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read Also:Health Benefits Of Beer: బీర్ తాగడం వల్ల 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
శనివారం నాడు మోహిత్, విజయ్ ఇద్దరు వాగ్వాదానికి దిగారని, ఆ తర్వాత మోహిత్ విజయ్‌పై దాడి చేశారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ దూబే తెలిపారు. మోహిత్ ప్రెజర్ ఎయిర్ పైప్ నాజిల్‌ను విజయ్ ప్రైవేట్ పార్ట్‌లోకి చొప్పించాడు. ఎయిర్ వాల్వ్‌ను తెరిచాడు. అనంతరం నిందితుడు మోహిత్ కూడా విజయ్‌పై కూర్చున్నాడని అలోక్ దూబే చెప్పారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.