చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘టెక్నో’ నుంచి మరో బడ్జెట్ మొబైల్ భారత మార్కెట్‌లోకి వస్తోంది. పాప్ సిరీస్‌లో భాగంగా పాప్ 9ని టెక్నో రిలీజ్ చేస్తోంది. టెక్నో పాప్ 9 4జీని నవంబర్ 22న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ భారతదేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాప్ 9 5జీని టెక్నో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్ ధరలో 4జీని తీసుకొస్తోంది. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉంటుందని అంచనా.
టెక్నో పాప్ 9 4జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499గా ఉండనున్నట్లు తెలుస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,999గా ఉండే అవకాశం ఉంది. పాప్ 9 5జీ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్‌ట్రైల్ బ్లాక్ రంగు ఎంపికలలో పాప్ 9 4జీ అందుబాటులో ఉంటుంది. 5జీ మాదిరిగానే 4జీ స్మార్ట్‌ఫోన్ లుక్ ఉండనుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
Also Read: Filpkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ సూపర్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై 9 వేల తగ్గింపు!
టెక్నో పాప్ 9 4జీ స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచెస్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హిలియో జీ50 చిప్‌సెట్‌తో ఇది రానుంది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ54 రేటింగ్‌ను ఇచ్చారు. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పాప్ 9 4జీ రానుంది. ఈ ఫోన్ ఐఆర్ రిమోట్ కంట్రోల్‌కు మద్దతు ఇస్తుంది. ఫుల్ డీటెయిల్స్ నవంబర్ 22న తెలియరానున్నాయి.