Tecno Phantom V Flip 5G: రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tecno Phantom V Flip 5G foldable smartphone.. Price and Specifications: ఫోల్డబుల్ ఫోన్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉండే ఈ ఫోన్ ను కొనాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ఫాంటం భారత్ మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీని తీసుకువచ్చేసింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ ఫోన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన కంపెనీ రెండో ఫోల్డబుల్ ఫోన్ ను శుక్రవారం ఆవిష్కరించింది. వచ్చేనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇక దీని ధర కూడా రూ.50 వేల లోపే ఉండనుండటం విశేషం. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ఫోన్ 8GB+256GB స్టోరేజీతో వస్తుంది. ఇక ఇది ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ రంగులలో రానుంది.
Also Read: Shamshabad: శంషాబాద్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు 300 మంది..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
6.9 Inches ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED ఇన్నర్ డిస్‌ప్లేను ఇది కలిగి ఉండనుంది. సర్క్యూలర్ AMOLED డిస్‌ప్లే 1.32 Inchesతో వస్తుంది. ఇక్కడి నుంచే నేరుగా మెసెజెస్‌కు రిప్లయ్ కూడా ఇవ్వొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ 8050 ప్రాసెసర్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13.5 వర్షన్ మీద పని చేస్తుందీ పోన్. ఇది రెండేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. దీనిలో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే దీంట్లో ఉండే 8GB ర్యామ్‌ను రెట్టింపు స్థాయికి అంటే 16GB వరకు పెంచుకోవచ్చు. ఇక బ్యాటరీ కెపాసిటీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh వస్తుంది. ఇక మనందరికి ఎంతో ముఖ్యమైన కెమెరా విషయానికి వస్తే 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, క్వాడ్ ఫ్లాష్ లైట్ యూనిట్‌తో 13-అంగుళాల మెగా పిక్సెల్ సెన్సర్ విత్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా లభిస్తుంది. ఇక సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 5జీతోపాటు వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పోటీపడనుంది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్ల కంటే తక్కువ ధరకే వస్తూ ఉండటంతో దీనిని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!