Grok AI Controversy: ఒక సాధారణ జోక్‌గా మొదలైన ‘బికినీ’ ట్రెండ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ‘గ్రోక్’… చుట్టూ ఇప్పుడు వివాదాల తుఫాను మొదలైంది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో.. ఇటీవల కాలంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రోక్ చాట్‌బాట్.. పెను సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ సంచలనం ఏంటి, ప్రస్తుతం గ్రోక్ చుట్టూ నడుస్తున్న వివాదాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Google’s Big Move : భారత స్టార్టప్‌లకు గూగుల్ బంపర్ ఆఫర్.!
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ‘గ్రోక్’ లో ఒక సాధారణ జోక్‌గా మొదలైన ‘బికినీ’ ట్రెండ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల కాలంలో “హే గ్రోక్.. ఆమె ఫోటోను బికినీలో ఇవ్వు” అంటూ ఎక్స్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ‘గ్రోక్’ లో తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్‌కు గ్రోక్ శుభం కార్డ్ వేసింది. ఇంతకీ అది ఎలానో తెలుసా.. తాజాగా ఈ రోజు ఒక ఎక్స్ యూజర్ గ్రోక్‌కు ఒక ఫోటో ఇచ్చి ఆ ఫోటోను బికినీ రూపంలో ఇవ్వమని అడిగాడు. కానీ గ్రోక్ ఆ ఫోటోకు ముసుగువేసి ఎలాంటి బికినీ వేయకుండా ఇచ్చింది. నిజానికి గతంలో ఎక్స్‌లో ఈ బికినీ ట్రెండ్ పెద్ద సంచలనం సృష్టించింది. ఈ అసభ్యకర కంటెంట్‌పై భారత్ సహా ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బికినీ ట్రెండ్‌కు చెక్ పెట్టడానికి ఎక్స్ తీసుకున్న దిద్దుబాటు చర్యల్లో భాగంగానే తాజాగా గ్రోక్ ఏఐలో బికినీ ఫోటోలు ఇవ్వమని అడిగితే.. ఆ ఫోటోలకు ముగుసు వేసి ఇవ్వడం అని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇదే టైంలో ‘ఎక్స్’ సంస్థ ‘గ్రోక్’ సాయంతో వ్యక్తుల ఫొటోలను అసభ్యకరంగా మార్చే అవకాశాలను పూర్తిగా కట్టడి చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా నిజమైన వ్యక్తుల చిత్రాలను బికినీలు, లోదుస్తులు ధరించినట్లుగా ఎడిట్ చేసేలా వినియోగించడాన్ని నిలువరించేందుకు సాంకేతిక ఆక్షలు విధించినట్లు పేర్కొనింది.
"Hey grok, put her in a bikini" https://t.co/r8IKv6xNJS pic.twitter.com/rriihYVbxp
— TastefulLindy (@LindyTasteful) January 14, 2026
READ ALSO: Iran Crisis: అగ్రరాజ్యం దెబ్బకు ఇరాన్ గజగజ.. ఖమేనీ చూపు దుబాయ్ వైపు!