Site icon NTV Telugu

Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన టెక్కీ..

Laptop Stolen

Laptop Stolen

Laptops Stolen: తాను పండించిన టమాటా పంట నష్టపోవడంతో ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని వ్యక్తిని మురుగేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను గత 6 నెలలుగా ITPL కంపెనీలో సిస్టమ్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి మురుగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురుగేష్ హోసూరులో ఆరు ఎకరాల్లో అప్పు చేసి టమోటా పంట సాగు చేశాడు. కానీ., పంట చేతికందక చాలా నష్టపోయాడు. అప్పు తీర్చేందుకు తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి ల్యాప్ టాప్ లను దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే సర్వీసింగ్, రిపేరింగ్ పేరుతో పలు ల్యాప్ ట్యాప్ లను దొంగిలించాడు. దీనిపై కంపెనీ ప్రశ్నించగా సెలవు తీసుకుని పరారయ్యాడు.

Chit Fund Fraud: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.50 లక్షలతో పరారీ

దొంగిలించిన ల్యాప్‌టాప్‌ లను హోసూరులో అతను విక్రయించాడు. ప్రస్తుతం అరెస్టయిన అతని నుంచి 22 లక్షల విలువైన 50 ల్యాప్ ట్యాప్‌ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారించిన పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు.

Devara : అమెరికాలో ‘దేవర’ స్పెషల్ ప్రీమియర్ షోకు Jr. NTR

Exit mobile version