Site icon NTV Telugu

Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన.. టియర్ గ్యాస్ ఉపయోగించిన పోలీసులు

Farmers Protest

Farmers Protest

Farmers Marching: తమ డిమాండ్లు పరిష్కరించాలని దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన చేపట్టేందుకు రైతులు భారీగా బయల్దేరారు. అయితే, రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల దగ్గర పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి.. అదనపు పోలీసు బలగాలను మొహరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సరిహద్దుల్లో 2 వేల మంది భద్రతా సిబ్బంది గస్తీ కాస్తున్నారు. పోలీసులతో పాటు సీఏపీఎఫ్, క్రైమ్ బ్రాంచ్, బెలాటియన్ సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొన్నారు.

Read Also: YV SUbba Reddy: సంక్షేమ పథకాలు ముందుకు వెళ్లాలంటే మళ్లీ జగన్‌ సీఎంగా రావాలి..

అయితే, పంజాబ్, హర్యానా మధ్య గల శంబు దగ్గర నుంచి రైతులు ఢిల్లీకి బయల్దేరారు.. రైతులు ట్రాక్టర్లలో వస్తుండటంతో ట్రాక్టర్ ట్రాలీలను ఢిల్లీలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో శంభు సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతులు, సైనికులు ముఖాముఖి తలపడ్డారు. దీంతో పోలీసుల పైకి రైతులు రాళ్లు రువ్వాగా.. ఆ తర్వాత పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ విడుదల చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా రైతులు ఒక్కసారి వెనక్కి తగ్గారు.. అయితే పొగ తగ్గడంతో వేలాది మంది రైతులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Exit mobile version