Site icon NTV Telugu

Team India: విరాట్ కంటే మొనగాడు లేడు.. టాప్-5 వన్డే బ్యాటర్ల లిస్ట్ ఇదే!

Virat Kohli

Virat Kohli

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు ఉంది. వన్డే సిరీస్‌ ముగియగా.. టీ20 సిరీస్‌ ఈరోజు మొదలైంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య కాన్‌బెర్రాలో తొలి మ్యాచ్‌ జరుగుతోంది. ఈ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఓ జాబితాను రిలీజ్ చేశాడు. భారత జట్టు తరఫున అదరగొట్టిన టాప్-5 వన్డే బ్యాటర్ల లిస్ట్‌ను ప్రకటించాడు. విరాట్ కోహ్లీ కంటే మొనగాడు లేడని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు.

Also Read: Montha Cyclone: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాలోని సూళ్లకు సెలవులు

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెండూల్కర్‌ సహా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, యువరాజ్‌ సింగ్‌ను టాప్ -5 భారత వన్డే బ్యాటర్లుగా గ్లెన్ మెక్‌గ్రాత్ అభివర్ణించాడు. లిస్ట్‌లో తొలి ప్లేస్‌ విరాట్ కోహ్లీని కాదని మరొకరికి ఇవ్వడం చాలా కష్టం అని పేర్కొన్నాడు. కింగ్ స్ట్రైక్‌రేట్, సగటు అద్భుతం అని ప్రశంసించాడు. రోహిత్‌ శర్మకు రెండో స్థానం ఇచ్చాడు. ‘వన్డే క్రికెట్‌లో రోహిత్ గణాంకాలు బాగున్నాయి. మూడు డబుల్ సెంచరీలు బాదాడు. వన్డేల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264. 276 మ్యాచుల్లో 11 వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టులతో పోలిస్తే వన్డేల్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రోహిత్ క్లాస్‌ ప్లేయర్, అందుకే రెండో స్థానం ఇచ్చా’ అని మెక్‌గ్రాత్ వివరించాడు. మూడో స్థానంను సచిన్‌కు ఇచ్చాడు. ఆపై ధోనీ, యువరాజ్‌ ఉన్నారు.

Exit mobile version