NTV Telugu Site icon

T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..

Ind Vs Ire

Ind Vs Ire

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఇక.. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు వాతావరణం మరియు పిచ్ రెండూ సహాయపడతాయి.

పిచ్-టాస్, ఓపెనింగ్‌పై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ..టాస్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా ఉండదని తెలిపారు. ఈ పిచ్ గురించి చెప్పడం కష్టమని.. పిచ్ కు తగ్గట్టు టీమిండియాలో ఆటగాళ్లు ఉన్నారన్నారు. తమ వద్ద నాణ్యమైన ఎంపికలు ఉన్నాయని ద్రవిడ్ తెలిపాడు. ఐపీఎల్‌లో రోహిత్, యశస్వి, విరాట్ అద్భుతంగా రాణించారని పేర్కొన్నారు. మ్యాచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కాంబినేషన్‌ను నిర్ణయిస్తామని అన్నారు.

Affiliate Marketing: ‘అఫిలియేట్ మార్కెటింగ్’ అంటే ఏంటి.. దానిని ఎలా మొదలుపెట్టాలంటే..

భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

ఐర్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్:
పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫెర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్‌.