NTV Telugu Site icon

KL Rahul: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్..

Kl Rahul

Kl Rahul

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరూ సోషల్ మీడియాలో తెలిపారు. కాగా.. తన భార్య డెలివరీ ఉందనే.. కేఎల్ రాహుల్ ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ క్రమంలో రాహుల్‌కు తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Rajya Sabha: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్‌..

రాహుల్, అతియా శెట్టి ప్రేమాయణం చాలా సంవత్సరాలు సాగింది. 2023 జనవరిలో వీరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ప్రైవేట్ జీవితం, కెరీర్‌ను కొనసాగించారు. తాజాగా ఈరోజు వారు తల్లిదండ్రులయ్యారు. తమ కుమార్తెని స్వాగతించారు. కాగా.. 2025 ఐపీఎల్ మెగా వేలంలో రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది.