Site icon NTV Telugu

Rishabh Pant: నేడే న్యూజిలాండ్‌తో వన్డేలకు టీమిండియా జట్టు ఎంపిక .. పంత్‌కు ఛాన్స్ ఉందా?

Rishabh Pant Test

Rishabh Pant Test

Rishabh Pant: ఈ నెల 11న న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌ కోసం శుక్రవారం సెలక్టర్లు టీమిండియా జట్టును సెలెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం సెలక్టర్లు ఎంపిక చేయబోయే జట్టులో రిషబ్‌ పంత్‌‌కు చోటు ఉంటుందా లేదా అనే దానిపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ రోజు ఎంపిక చేయబోతున్న జట్టులో ఎవరికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Gold Rates: కొత్త ఏడాదిలోనూ మగువలకు షాక్.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిజానికి రిషబ్‌ పంత్‌‌ టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మనోడికి టీ20 జట్టులో చోటు లేదు, వన్డే టీంలోకి కూడా వస్తూ పోతూ ఉన్నాడు. ఈ ఫార్మాట్లో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తుండటం, పంత్‌ ఫామ్‌ కూడా గొప్పగా లేకపోవడంతో తన ప్లేస్‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. గత ఏడాది మొత్తం పంత్ వన్డేల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా జట్టులో ఉన్నప్పటికీ పంత్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు.

దక్షిణాఫ్రికాతో గత నెల జరిగిన వన్డే సిరీస్‌లో కూడా పంత్‌కు ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఇదే టైంలో పంత్ విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో సత్తా చాటాలని ట్రై చేసిన.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో ఆయన వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 70, 22, 24 పరుగులు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌కు ధ్రువ్‌ జురెల్‌ ఫామ్‌ బాగున్న నేపథ్యంలో అతడినే రెండో వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేసి, పంత్‌ను సైడ్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.

దక్షిణాఫ్రికాపై సెంచరీలతో కదం తొక్కిన యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌లను జట్టులో కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా గాయం నుంచి కోలుకొని జట్టులోకి పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్పిన్‌ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్‌లు ఎంపికయ్యే ఛాన్సుంది. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించనున్నట్లు సమాచారం. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి పేరును సెలక్టర్లు ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటారేమో వేచి చూడాలి. ఇదే టైంలో అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణలకు టీంలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మరి పంత్ విషయంలో సెలక్టర్ల నిర్ణయం ఎలా ఉంటుందో అనేది.

READ ALSO: Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్‌కి ట్రీట్.. ‘లెనిన్’ ఫస్ట్ సింగిల్‌కి డేట్ లాక్

Exit mobile version