Site icon NTV Telugu

IND vs NZ Final: 25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ ఢీ!

Indvsnz

Indvsnz

IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగనుంది. ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా, కివీస్ మధ్య జరిగబోయే పోరు చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే, సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఒకదానికొకటి పోటీ పడబోతున్నాయి. అయితే, వాస్తవానికి 8 టీమ్స్ మధ్య జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో స్టార్ట్ అయింది. ఈ టోర్నమెంట్ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించనున్నారు. కానీ, కరోనా దెబ్బకి ఈ టోర్నమెంట్ 2017 నుంచి ఇప్పటి వరకు జరగలేదు. కానీ, ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో టీమిండియా 25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోబోతోంది.

Read Also: Trump: హమాస్‌కు ట్రంప్ చివరి వార్నింగ్.. వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరిక

ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఒకే ఒక్క మ్యాచ్ 2000 సంవత్సరంలో జరగ్గా.. ఆ ఎడిషన్ ఫైనల్‌లో ఇరు జట్లు పోటీపడ్డాయి. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. ఈ టార్గెట్ ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు తేడాతో గెలవడమే కాకుండా.. ఛాంపియన్‌గా నిలిచింది కివీస్. అనంతరం ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల మధ్య ఎలాంటి మ్యాచ్ కూడా జరగలేదు. అయితే, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మరోసారి దుబాయ్‌లో జరగబోయే ఫైనల్ లో భారత్- న్యూజిలాండ్ తలపడబోతున్నాయి.

Read Also: Ananya : ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆమెను చూసి నేర్చుకున్నా

అయితే, టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 118 వన్డే మ్యాచులు జరిగాయి. అందులో భారత్ 60 మ్యాచ్‌ల్లో గెలిచవగా, కివీస్ 50 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 6 వన్డేల్లో రోహిత్ సేననే పై చేయి సాధించింది . అంటే, ఈ మ్యాచ్‌లో ఫైనల్ మ్యాచ్ లో కూడా టీమిండియా సాధిస్తుందని భావిస్తున్నారు.

Exit mobile version