Jitesh Sharma: ఇంగ్లాండ్, భారత్ మద్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ ఘటన చోటుచేసుకుంది. భారత క్రికెటర్ జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియంలోకి అనుమతించకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియం గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. తనను తాను భారత క్రికెటర్‌గా పరిచయం చేసుకున్నా, అక్కడి సిబ్బంది ఆయనను గుర్తించకపోవడంతో లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో జితేష్ కొంతసేపు బయటే వేచి చూడాల్సి వచ్చింది.
Read Also:Kingdom: అమెరికాలో సత్తా చాటుతున్న విజయ్.. “కింగ్డమ్” కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్..!
ఇకపోతే, ఆ మ్యాచ్ కు అదే మైదానంలో వ్యాఖ్యాతగా ఉన్న భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్టేడియం బయటకు వచ్చాడు. దానితో జితేష్ శర్మ కార్తీక్ ను గుర్తించి పలుమార్లు పిలవగా, మొదట్లో కార్తీక్ ఫోన్‌లో ఉండటంతో స్పందించలేదు. కానీ, జితేష్ పదేపదే పిలిచిన అనంతరం కార్తీక్ స్పందించి జితేష్ ను లోపలికి తీసుకెళ్లేలా సెక్యూరిటీతో మాట్లాడాడు. ఈ ఘటనను ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. లార్డ్స్ మైదానం వంటి ప్రఖ్యాత స్థలంలో భారత క్రికెటర్‌ను గుర్తించకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దినేష్ కార్తీక్ తక్షణ స్పందనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also:AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు.. కీలక అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
జితేష్ శర్మ ఇటీవల RCB తరఫున ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. జట్టు టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అతను ప్రస్తుతం భారత టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. అలాంటి గుర్తింపు ఉన్న క్రికెటర్‌ను గుర్తించకుండా ఇబ్బంది పెట్టడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో లార్డ్స్ మైదానంలో భద్రతా సిబ్బంది అవగాహనపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌ను గుర్తించకపోవడం, ప్రవేశాన్ని నిరాకరించడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Lord's security guard didn't allow Jitesh Sharma to enter the stadium.
This is so embarrassing 😭😭
pic.twitter.com/EVKLDdM0oc— ` (@WorshipDhoni) July 16, 2025