NTV Telugu Site icon

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారితో ప్రమాదమంటున్న రిక్కీ పాంటింగ్

Rickey Ponting

Rickey Ponting

రెండు నెలల పాటు హోరాహోరీగా సాగిన ఐపీఎల్ ముగిసింది. పొట్టి క్రికెట్ ముగిసాక నెక్స్ట్ ఏంటా అని అనుకుంటున్నారా.. ప్రపంచ చాంపియన్ షిప్. ఈనెల 7 నుంచి 5 రోజుల పాటు ఇంగ్లాండ్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ, క్రికెట్ అస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. డబ్ల్యూటీసీకి సంబంధించి పలువురు మాజీలు క్రికెటర్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ గురించి అసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read : Sachin Tendulkar : రెజ్లర్ల ఉద్యమంపై సచిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్ లో కింగ్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా టీమిండియాకు కీలకంగా మారతారని రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా టార్గెట్ మొత్తం వీరిద్దరిపైనేనని.. వారిని ఎంత త్వరగా ఔట్ చేస్తే అంత మంచిదని తెలిపాడు. అలాంటి వ్యూహాలతోనే వారు బరిలోకి దిగుతుందన్నాడు. ఆసీస్ టీమ్ కు కోహ్లీ, పుజారాతోనే చివరి వరకు ప్రమాదం పొంచి ఉందన్నాడు. అయితే రికీ పాంటింగ్ చెప్పిదాంట్లో అబద్ధమేమీ లేదు. కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థులకే హడలే.. అలా అని.. టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు ఆసీస్ పైన మంచి రికార్డులు ఉన్నాయి. అందుకే రిక్కీ ఈ కామెంట్స్ చేశారు. ఆసీస్‌తో పుజారా ఆడిన 24 మ్యాచ్‌ల్లో మొత్తం 2033 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండడం విశేషం.

Also Read : Karumuri Nageswara Rao: చంద్రబాబు మాయమాటలు చెప్పే వ్యక్తి.. టీడీపీ మేనిఫెస్టో ఓ టిష్యూ పేపర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్లు:
భారత టెస్ట్‌ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్‌, ఇషాన్‌ కిషన్‌.
ఆస్ట్రేలియా టెస్ట్‌ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

Show comments