NTV Telugu Site icon

Gautam Gambhir: ఇక నా లక్ష్యం అదే: గౌతమ్‌ గంభీర్‌

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir Tweet After Elected as Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ ఎంపికయ్యాడు. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్‌ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్‌ కూడా బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూకు హాజరైనా.. గంభీర్‌కే అందరూ ఓటేశారు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు.

హెడ్ కోచ్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన అనంతరం గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. భారత్‌ తన గుర్తింపు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమే తన లక్ష్యమని గౌతీ అన్నాడు. ‘భారత్‌ నా గుర్తింపు. దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవం. ఈసారి నా పాత్ర భిన్నమైంది. కానీ నా లక్ష్యం మాత్రం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేయడం. భారత జట్టు 140 కోట్ల మంది భారతీయుల కలల భారాన్ని మోస్తోంది. ఆ కలలను నిజం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించాలనే ఉత్సాహంతో ఉన్నా. ఆటగాడిగా టీమిండియా జెర్సీని ధరించినందుకు గర్వపడ్డా. కొత్త పాత్రలోనూ అలాగే ఫీల్ అవుతా. బీసీసీఐ, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్‌ లక్ష్మణ్, సహాయ సిబ్బంది, ఆటగాళ్లతో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని గంభీర్‌ చెప్పాడు.

Also Read: Ntr Devara Update: దేవర ముంగిట వారం రోజులు మాత్రమే..

42 ఏళ్ల గౌతమ్ గంభీర్‌ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్లలో గౌతీ సభ్యుడు. అంతేకాదు ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో టాప్‌ స్కోరర్‌ కూడా. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 2012, 2014లో కోల్‌కతాకు టైటిళ్లను అందించాడు. ఇక 2024లో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన కోల్‌కతాకు మెంటర్‌గా గౌతీ నిరూపించుకున్నాడు.