Site icon NTV Telugu

India Vs South Africa Test 2025: ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా పరాభవానికి ఇవే ప్రధాన కారణాలు..

Reasons For India Loss

Reasons For India Loss

India Vs South Africa Test 2025: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెంబా బావుమా నేతృత్వంలోని ఈ ఆఫ్రికన్ జట్టు 30 పరుగుల తేడాతో భారత్‌పై అద్భుత విజయం సాధించింది. టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ఈ విజయం ప్రత్యేకమైనది.. ఎందుకంటే 15 ఏళ్లలో ఒక ఆఫ్రికన్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో భారతదేశాన్ని ఓడించడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కానీ టీమిండియా ఘోర పరాభవానికి ఐదు ప్రధాన కారణాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Delhi Car Blast: ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్‌లో డాక్టర్ ప్రియాంకా శర్మకు సంబంధం..

తేలిపోయిన టీమిండియా బ్యాటింగ్..
కోల్‌కతా టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాటింగ్ పూర్తిగా తేలిపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారతదేశం మొత్తం 189 పరుగులు చేసింది, కానీ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా అర్ధశతకం సాధించలేకపోయాడు. ఈ మ్యాచ్‌‌లో టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. జట్టులోని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ T20 శైలిలో బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించారు. అయితే ప్రతి బ్యాట్స్‌మన్ దాడి చేసే మనస్తత్వంతో వచ్చి వికెట్లు కోల్పోయారు. అయిన కూడా టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్‌లో స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకోడానికి బదులుగా రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణంగా చతికిలాపడింది. దక్షిణాఫ్రికాకు కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. దీంతో బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు భారత్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా తరుఫున రెండు ఇన్నింగ్స్‌లలో యశస్వి గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయాడు.

స్పిన్ ఆడటంలో సవాల్
ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇబ్బంది పడింది. ఏ బ్యాట్స్‌మెన్ కూడా స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడలేకపోయాడు. పంత్ మొదటి బంతి నుండే ప్రయోగాత్మక షాట్లు ఆడుతున్నట్లు కనిపించింది. అయితే ఏ బ్యాట్స్‌మన్ కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఫలితంగా భారత ఇన్నింగ్స్ 93 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం యశస్వి ఫామ్ లేకపోవడం. రెండు ఇన్నింగ్స్‌లలోనూ యశస్వి ఘోరంగా విఫలమయ్యాడు, ఈ ప్లేయర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఖాతా తెరవలేకపోయాడు. అదే సమయంలో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేశాడు, కానీ రెండో ఇన్నింగ్స్‌లోని మొదటి బంతి నుంచే ఓపికగా ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అతను అటాకింగ్ మోడ్‌లో కనిపించాడు. ఫలితంగా కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు.

గిల్ గాయం మరొక కారణం
ఈ ఓటమికి కెప్టెన్ గిల్ గాయం ఒక కారణం. కెప్టెన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు కేవలం మూడు బంతులు మాత్రమే ఆడగలిగాడు. ఆ తర్వాత అతనికి మెడ నొప్పి వచ్చి మైదానం వదిలి వెళ్ళాల్సి వచ్చింది. రెండవ ఇన్నింగ్స్‌లో కూడా అతను బ్యాటింగ్ చేయలేకపోయాడు. గిల్ లేకపోవడంతో భారత జట్టులో ఒక బ్యాట్స్‌మన్ తక్కువయ్యాడు. మొత్తం మీద భారత జట్టు ఓటమికి అతిపెద్ద కారణం జట్టు సభ్యులకు అనుభవం లేకపోవడం. మైదానంలో బ్యాట్స్‌మెన్లు ఓపికగా నిలబడలేదు, వాళ్లు గొప్ప భాగస్వామ్యాలను నిర్మించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో సుందర్ ఒక్కడే 50 బంతుల కంటే ఎక్కువ బంతులను ఆడిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మీరు గమనిస్తే మరే ఇతర బ్యాట్స్‌మన్ కూడా 50 బంతులు కూడా ఆడలేకపోయాడు.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 189 పరుగులు చేసి 30 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను 153 పరుగులకే ఆలౌట్ చేశారు. బావుమా అజేయంగా 55 పరుగులు చేశాడు. భారత్ ముందు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, భారత జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సుందర్ (31) నిలిచాడు.

READ ALSO: Best 5G Smartphones: రూ.15 వేల బడ్జెట్‌లో.. బెస్ట్ 5G ఫోన్లు.. 6500mAh బ్యాటరీతో సహా క్రేజీ ఫీచర్లు

Exit mobile version