Team India: బ్లూ జెర్సీ జోరు.. ఒకే రోజులో ట్రిపుల్ విక్టరీతో భారత్ సంచలనం.!

Team India (1)

Team India (1)

Team India: జూన్ 17, 2026 భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది. ఒకే రోజులో భారత పురుషుల జట్టు, మహిళల జట్టు, అలాగే ఇండియా ‘A’ జట్టు వేరు వేరు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు నమోదు చేశాయి. మూడు జట్లు, మూడు వేర్వేరు ప్రత్యర్థులు, కానీ ఫలితం మాత్రం ఒక్కటే.. అదే భారత్ విజయం.

అఫ్గానిస్థాన్‌పై పురుషుల జట్టు:

భారత పురుషుల జట్టు అఫ్గానిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 154 పరుగులతో చెలరేగగా, ఇషాన్ కిషన్ 125 పరుగులతో మరో అద్భుత శతకం నమోదు చేశాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ 402 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గానిస్థాన్ భారత బౌలర్ల దాడిని తట్టుకోలేకపోయింది. ఫలితంగా భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

×
×
Ad

మహిళల జట్టు ప్రపంచ కప్ లో సత్తా:

భారత మహిళల జట్టు కూడా తన అద్భుత ఫామ్‌ను కొనసాగించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధన 74 పరుగులు, షఫాలీ వర్మ 55 పరుగులతో మెరిశారు. వీరి ఇన్నింగ్స్‌ లతో భారత్ 209 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ జట్టు 114 పరుగులకే కుప్పకూలడంతో 95 పరుగుల తేడాతో భారత్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది.

ఇండియా ‘A’ జట్టు:

యువ ఆటగాళ్లతో కూడిన ఇండియా ‘A’ జట్టు కూడా అఫ్గానిస్థాన్ ‘A’పై అద్భుత ప్రదర్శన చేసింది. తిలక్ వర్మ 59 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, నిశాంత్ సింధు నాలుగు వికెట్లు తీసి బౌలింగ్‌లో మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 319 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో 218 పరుగులకే అఫ్గానిస్థాన్ కుప్పకూలింది. సమిష్టి కృషితో ఇండియా ‘A’ జట్టు 101 పరుగుల తేడాతో విజయం సాధించి భారత క్రికెట్ భవిష్యత్ ఎంత బలంగా ఉందో మరోసారి చాటిచెప్పింది.

భారత క్రికెట్:

ఒకే రోజులో మూడు భారత జట్లు విజయాలు సాధించడం సాధారణ విషయం కాదు. ఇది భారత క్రికెట్‌లో ఉన్న ప్రతిభ, వ్యవస్థ, యువ ఆటగాళ్ల తయారీ విధానం ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చూపించింది. సీనియర్ జట్టు నుంచి మహిళల జట్టు వరకు, యువ ఆటగాళ్లతో కూడిన ‘A’ జట్టు వరకు ప్రతి స్థాయిలో విజయాలు రావడం భారత క్రికెట్‌కు ఉన్న అపారమైన బలాన్ని సూచిస్తుంది.

https://twitter.com/BCCI/status/2067221854327341102