Team India Coach: దక్షిణాఫ్రికా పర్యటన.. టీమిండియాకు కొత్త కోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid Not Keen To Continue As India Coach: భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రావడం దాదాపుగా ఖాయం అయింది. వన్డే ప్రపంచకప్ 2023తో రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియగా.. ఇక ఆ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాడట. ద్రవిడ్ స్థానంలో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 5 మ్యాచుల టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత జట్టుకు లక్ష్మణే హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌సీఏ హెడ్ అయిన వీవీఎస్.. గతంలో కొన్నిసార్లు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు.
‘భారత జట్టు హెడ్ కోచ్‌గా పనిచేసేందుకు వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రపంచకప్ 2023 సందర్భంగా అహ్మదాబాద్ వెళ్లి బీసీసీఐ పెద్దలను కలిశారు. కోచ్‌గా లక్ష్మణ్ దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌పై సంతకం చేయనున్నారు. డిసెంబర్ మాసంలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు బాధ్యతలు అందుకోనున్నారు. పూర్తి స్థాయి కోచ్‌గా లక్ష్మణ్‌కు తొలి పర్యటన అవుతుంది’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. 2021 నవంబరులో టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడయిన రాహుల్ ద్రవిడ్.. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో అతడి పదవీకాలం ముగిసింది.
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
Also Read: Koti Deepotsavam 2023 11th Day: కన్నుల పండుగగా కోటిదీపోత్సవం.. పదకొండవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే..
‘పూర్తి స్థాయి కోచ్‌గా కొనసాగలేనని రాహుల్ ద్రవిడ్ బీసీసీఐతో చెప్పారు. ఆటగాడిగా దాదాపు 20 ఏళ్లు జట్టుతో ప్రయాణించారు. కోచ్‌గా రెండేళ్ల పాటు సేవలు అందించారు. ఇక పనిచేయడానికి రాహుల్ సిద్ధంగా లేరు. అయితే ఎన్‌సీఏ హెడ్ గా ఉండడానికి అతడికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే.. సొంతూరు బెంగళూరులో ఉండొచ్చు. అప్పుడప్పుడు జట్టుకు కోచింగ్ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ పూర్తి స్థాయి కోచ్ పదవికి మాత్రం సిద్ధంగా లేరు’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇక బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ల పదవీకాలం కూడా ముగిసింది. ఇతర కోచ్‌ల లాగే వీవీఎస్ లక్ష్మణ్ కూడా తనకు నచ్చిన సహాయ సిబ్బందిని ఎంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!