Suryakumar Yadav: భారత జట్టుకు రెండు ఫార్మాట్లలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. టెస్టులు, వన్డేలకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తుండగా.. టీ20లకు మాత్రం సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నారు. పొట్టి ఫార్మాట్‌లోనూ సూర్యకు గిల్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. ఇక, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుకు సూర్యకుమార్ నాయకత్వం వహించనున్నాడు. అయితే, రాబోయే రోజుల్లో ఒకే కెప్టెన్‌గా గిల్ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో గిల్ రాకతో తనపై ఒత్తిడి పెరిగిన మాట నిజమేనని సూర్య ఒప్పుకున్నాడు. దాని నుంచి తాను ప్రేరణ పొంది అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించేందుకు ట్రై చేస్తానని తెలియజేశాడు.
Read Also: Tirupathi : తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..మత్తులో ములిగిపోయిన యువత
అయితే, శుభ్‌మన్ గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ గా రావడం ఆనందంగా ఉంది. టీమ్ ను అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు.. ఇక, అతడి రాకతో నాపై ఒత్తిడి మరింత పెరిగిందని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ విషయంలో నేను అబద్ధం చెప్పను.. ప్రతి ఒక్కరికి ఆ భయం ఉండటం సహజం అన్నారు. అయితే, దాని గురించి నేను మరీ ఎక్కువగా ఆలోచించను.. నా ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను అని వెల్లడించారు. భవిష్యత్తులో గిల్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించినా సరే నేనేమీ ఇబ్బంది పడను.. మా ఇద్దరి మధ్య స్టేడియంలోనే కాదు.. బయట కూడా మంచి స్నేహం ఉందన్నాడు. అతడు ఎలాంటి వ్యక్తి అనేది నాకు తెలుసు.. ఆ ప్రేరణతోనే మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాను అను టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
Read Also: JR NTR : ఎన్టీఆర్ పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ తొలగిపోయినట్టే..
కాగా, గతంలో సూర్య కుమార్ క్రీజ్‌లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి.. కానీ, ఇటీవల కాలంలో అతడు గొప్పగా ప్రదర్శన ఇవ్వలేదని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో సారథ్యం చేపట్టిన తర్వాత బ్యాటర్‌గానూ మంచి ఆట తీరు కనబరిచాడు. వచ్చే ఏడాది టీ20 కప్ జరగనుంది. అప్పటి వరకూ సారథిగా సూర్య కుమార్ యాదవ్ ఉండాలంటే ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో అతడు రాణించాల్సిందేనని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు.
