NTV Telugu Site icon

Suryakumar Yadav: ఫియర్ లెస్ క్రికెట్ అంటేనే నాకు ఇష్టం.. రికార్డులు కాదు..

Surya Kumar Yadav

Surya Kumar Yadav

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియా కొత్త సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌ అనుభవాలను షేర్ చేశాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం బాధాకరం.. ఆ టోర్నమెంట్ లో తమ ప్రయాణం అద్భుతంగా సాగిందన్నాడు. ఫైనల్లో ఓడినప్పటికీ తమ ప్రదర్శన యావత్‌ భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

Read Also: Alia Bhatt: ట్రెండీ డ్రెస్‌లో హీటెక్కిస్తున్న అలియా భట్..

వరల్డ్ కప్ పైనల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మరచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నాము అని టీమిండియా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ భారత జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడంటూ హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే వరల్డ్‌ ఛాంపియన్లను ఢీకొట్టేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.

Read Also: Atrocious: పల్నాడులో దారుణం.. అత్తింటి వారిని హత్య చేసిన కోడలి తరుపు బంధువులు..

రోహిత్‌ శర్మ లాగే తాను కూడా టీమ్ కు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదన్నాడు.. ఇక, ఆస్ట్రేలియా-భారత్ టీ20 సిరీస్ యొక్క ప్రాముఖ్యతను సూర్య వివరిస్తూ.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ సిరీస్‌ చాలా కీలకమన్నాడు. నిర్భయంగా, నిస్వార్ధంగా, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆడమని టీమ్ సభ్యులతో చెప్పానని అతడు పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో జరిగిన దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్ లో వారు అదే చేశారని స్కై వెల్లడించాడు. కాగా, విశాఖపట్నం వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది.