Site icon NTV Telugu

IND vs AUS : రవిశాస్త్రివి అన్నీ ఒట్టి మాటలే.. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Ravi

Rohit Ravi

IND vs AUS : ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే ఆస్ట్రేలియాతో ఇండోర్ టెస్టులో భారత జట్టు ఓడిపోయిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యను భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపారేశాడు. 2014 తర్వాత ఏడేళ్లలో ఆరేళ్లపాటు భారత జట్టుకు శాస్త్రి ప్రధాన కోచ్‌గా ఉన్నారు. మూడో టెస్టులో అతివిశ్వాసం కారణంగానే టీమిండియా ఓడిందంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించడంపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. బయటి వ్యక్తులు చేసే ఇలాంటి చెత్త వ్యాఖ్యలను మేం పట్టించుకోం అని రోహిత్ అన్నాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మరింతగా స్పందిస్తూ..”నిజాయితీగా చెప్పాలంటే మేం తొలి రెండు టెస్టు లు గెలిచాం. అయితే ఆ గెలుపుని బయటి వ్యక్తులు అతి విశ్వాసం అంటున్నారు. ఆ వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయి.

Read Also: WPL 2023 : తొలి విజయాన్ని నమోదు చేసిన గుజరాత్ జట్టు

ఎందుకుంటే ఏ జట్టు అయినా ఉత్తమ ప్రదర్శన ఇచ్చి, విజయం సాధించడానికే చూస్తాయి. ఇక అతి విశ్వాసం అని చెప్పే వాళ్లకు డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి వారు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు” అని రోహిత్ కాస్త ఘాటుగానే స్పందించాడు. గురువారం నుంచి అహ్మదాబాద్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విలేకరులు అడిగిన ప్రశ్నకు రోహిత్ ఈమేరకు స్పందించాడు. బయట ఉండే వాళ్లకు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతోందో ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశాడు. ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా కనికరం లేకుండా ఆడాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడని… తాము కూడా అదే మైండ్ తో ఆడతామని అన్నాడు.

Exit mobile version